News November 18, 2024
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం వికేంద్రీకరణ: కలెక్టర్ ఆనంద్

ప్రజల వద్దకు పరిపాలనను మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వికేంద్రీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రేపటి నుంచి మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్ర కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల్లో అర్జీలు సమర్పించవచ్చునని ఆయన వివరించారు.
Similar News
News December 7, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలన్నారు.
News December 7, 2025
సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
News December 7, 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.


