News March 8, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక పునః ప్రారంభం: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి 04/3/25 మంగళవారం ముగియటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పున ప్రారంభిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 10/3/25 సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10 గం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా శుక్రవారం తెలియజేశారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ వలసిందిగా కోరారు.
Similar News
News September 15, 2025
ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
News September 15, 2025
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ – 0863 2234014 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News September 15, 2025
గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్లోని డిస్ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.