News March 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు

తిరుపతి కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News November 20, 2025
‘కొదమసింహం’ నాకు, చరణ్కు ఫేవరేట్ మూవీ: చిరంజీవి

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘కొదమసింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. నాకు, రామ్ చరణ్కు ఫేవరేట్ మూవీ’ అని తెలిపారు. కొదమసింహం సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
News November 20, 2025
భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
News November 20, 2025
నితీశ్ రికార్డు.. బిహార్ సీఎంగా పదోసారి

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2000 మార్చిలో కేవలం వారం రోజులే నితీశ్ సీఎంగా ఉన్నారు. తర్వాత 2005 నుంచి జరిగిన 5 ఎన్నికల్లోనూ ఇతర పార్టీల పొత్తుతో గెలిచి అధికారం చేపట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేశారు. ఇటు NDAతో, అటు MGBతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఆయన స్పెషాలిటీ.


