News March 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేళలు ఇవే: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రజలెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 9.30 గంటలకే అర్జీల స్వీకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
Similar News
News July 6, 2025
అనంత: ‘బెంగళూరు వెళ్తున్నానని చెప్పి లవర్‌ను పెళ్లి చేసుకుంది’

ప్రత్యేక కోర్సు కోసం బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనంతపురం శ్రీనివాసనగర్‌కు చెందిన యువతి, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు షాకిచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ఆమె జూన్ 20న ఇంటి నుంచి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. త్రీ టౌన్ PSలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమె ఆచూకీ లభించగా, ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
News July 6, 2025
కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News July 6, 2025
సిరిసిల్ల: IIITకి 24 మంది విద్యార్థులు ఎంపిక

గంభీరావుపేట మండలంలో 24 మంది విద్యార్థులు బాసర IIITకి ఎంపికైనట్లు మండల విద్యాధికారి సంటి గంగారం తెలిపారు. మండలంలోని లింగన్నపేట, మల్లారెడ్డిపేట, సముద్ర లింగాపూర్, దమ్మన్నపేట, కొత్తపల్లి, గజ సింగవరం, ముచర్ల, నాగంపేట గ్రామాలకు చెందిన ZPHS విద్యార్థులు బాసర IIITలో సీట్లు సాధించారన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.