News April 13, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

తిరుపతి కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆ రోజున బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినాన్ని ప్రకటించిందన్నారు. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
Similar News
News November 15, 2025
కాగజ్నగర్: విద్యార్థులకు రేపు అవగాహన సదస్సు

కాగజ్నగర్: డా. బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్లో చదువుతున్న డిగ్రీ I, II, III సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 16న ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. శ్రీదేవి, కోఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ తెలిపారు. తరగతులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని వారు సూచించారు.
News November 15, 2025
నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

నిజామాబాద్లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
News November 15, 2025
96 లక్షల ఫాలోవర్లు.. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి

బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ అభ్యర్థి, యూట్యూబర్ మనీశ్ కశ్యప్ పోటీ చేసి ఓడిపోయారు. చన్పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ గెలుపొందారు. యూట్యూబ్లో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మనీశ్కు 37,172 ఓట్లు రాగా 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడారు. తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో అప్పట్లో అతడిని TN పోలీసులు అరెస్టు చేశారు.


