News April 13, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: విశాఖ కలెక్టర్

image

ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా రేపు(ఏప్రిల్14న) రద్దు అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అంబేడ్క‌ర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్‌తో పాటు, జీవీఎంసీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 23, 2026

విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

image

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 23, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

News February 23, 2026

నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

image

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.