News September 8, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News December 17, 2025
శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ?

శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇతను మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం నుంచి ఉత్తర్వులు రానున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ని 26 జిల్లాలకు కొత్త టీడీపీ అధ్యక్షుల పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.
News December 17, 2025
ఎచ్చెర్ల: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన’

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని AP మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీని ఆమె సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పిల్లల రక్షణకు కూడా పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>


