News February 2, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం తెలియజేశారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ను తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని ఎన్నికలు పూర్తి అయిన తర్వాత యథావిధిగా ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించే గ్రీవెన్స్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 25, 2025
భిక్కనూర్: ‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ చెప్పారు. మంగళవారం భిక్కనూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు రూ.మూడున్నర కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
News November 25, 2025
కామారెడ్డి: ‘అనధికారిక స్టాకింగ్ చేస్తే కఠిన చర్యలు’

నిజాంసాగర్ రిజర్వాయర్లో రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% ఉచిత గ్రాంట్తో చేప/రొయ్య పిల్లల పెంపకం కార్యక్రమం చేపడుతోంది. అనధికారిక సంఘాలు సొంతంగా చేప/రొయ్య పిల్లలను వదలడం పూర్తిగా నిషేధించారు. మత్స్య సంపదపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. మత్స్యకారులు ప్రైవేటుగా సీడ్ వేసి ఆర్థికంగా నష్టపోవద్దని, చట్టపరమైన ఇబ్బందులు పడొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి డోలి సింగ్ విజ్ఞప్తి చేశారు.
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.


