News February 3, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనకాపల్లి ఎస్పీ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ ఈనెల 29 నుంచి మార్చి 8 వరకు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ కార్యాలయానికి రావద్దని కోరారు.
Similar News
News October 24, 2025
వికారాబాద్: పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించాలి: సీపీఎం

పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీపీఎం ఆధ్వర్యంలో కలిసి పత్తి రైతులకు క్వింటాలుకు రూ.5 వేల బోనస్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. డిమాండ్‌ను ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ వారికి తెలియజేశారు.
News October 24, 2025
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి: అదనపు కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబాబాద్ మండలం శనిగపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూమ్ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్ పాఠాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
గుడిసె లేని ఊరే ప్రజాపాలన లక్ష్యం: పరిగి ఎమ్మెల్యే

గుడిసె లేని ఊరిని చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ పూజలో ఆయన పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.


