News September 10, 2024
ప్రజ్ఞాపూర్: నిమజ్జనం లేని గణపతికి నిత్య పూజలు
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని పురాతన ఆలయంలో మహాగణపతి నిత్య పూజలు అందుకుంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం. ప్రజ్ఞాపూర్ లో మహా గణపతి విగ్రహం స్వయంభుగా కొలువైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని స్థానికులు తెలుపుతున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News October 9, 2024
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డిని ఎన్నుకున్నట్లు జిల్లా పీఆర్టీయు అధ్యక్షుడు మానయ్య తెలిపారు. మహిపాల్ రెడ్డి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
News October 9, 2024
మెదక్: DSCకి 937 మంది ఎంపిక
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 937 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LBస్టేడియంలో CM రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 397, మెదక్- 281, సిద్దిపేట- 259 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.
News October 8, 2024
మంత్రి సీతక్కకు సమస్యలు విన్నవించిన ఎంపీ
రాష్ట్ర మంత్రి సీతక్కను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. ఈరోజు జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను జహీరాబాద్ ఎంపీ కలిసి పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఎంపీ విన్నవించిన సమస్యలకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ సురేష్ షెత్కార్ వివరించారు. సిర్గాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మనీష్ పాటిల్ పాల్గొన్నారు.