News September 13, 2024

ప్రణాళిక బద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలి: ఇంటర్ విద్యాధికారి

image

ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి చెప్పారు. శుక్రవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సబ్జెక్టుపై విద్యార్థి పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ప్రశాంత వాతావరణంలో కళాశాల ఉండడం ఎంతో అభినందనీయమని చెప్పారు.

Similar News

News December 20, 2025

మెదక్‌లో జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష

image

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లు, లోక్ అదాలత్‌లో పరిష్కారానికి వచ్చే కేసుల వివరాలపై చర్చ జరిగింది. అనుకూల వాతావరణంలో కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానం, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.

News December 20, 2025

MDK: నాడు భార్య.. నేడు భర్త సర్పంచ్

image

వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్‌గా వంచ భూపాల్ రెడ్డి గెలవగా గతంలో ఆయన భార్య భాగ్యమ్మ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో భార్య, భర్త సర్పంచ్‌లుగా అవకాశం రావడం అరుదు అని గ్రామస్థులు అన్నారు. బుధవారం జరిగిన ఎన్నికలలో భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

News December 20, 2025

మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్‌గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు.