News September 13, 2024
ప్రణాళిక బద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలి: ఇంటర్ విద్యాధికారి
ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి చెప్పారు. శుక్రవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సబ్జెక్టుపై విద్యార్థి పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ప్రశాంత వాతావరణంలో కళాశాల ఉండడం ఎంతో అభినందనీయమని చెప్పారు.
Similar News
News October 16, 2024
సంగారెడ్డి: మంత్రి దామోదర్ నేటి పర్యటన వివరాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ట్రాఫిక్ పోలీసులకు బైకులను పంపిణీ చేస్తారన్నారు. 11 గంటలకు శివంపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు.
News October 15, 2024
దుబ్బాక: భర్తకు తలకొరివి పెట్టిన భార్య
వారిద్దరూ అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి జీవనం సాగించారు. అయితే విధి వారి బంధాన్ని విడదీసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేటకు చెందిన పూల శంకర్(55), రాధ భార్యాభర్తలు. సోమవారం ప్రమాదవశాత్తు శంకర్ మురికి కాలువలోపడి మృతి చెందాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో రాధ అంతా తానై భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. తానే భర్తకు తలకొరివి పెట్టింది. ఈఘటన బంధువులను కంటతడి పెట్టించింది.
News October 14, 2024
సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన
అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.