News March 2, 2025
ప్రతాపగిరి అడవుల్లో పులి పాదముద్రలు

కాటారం, మహాదేవపూర్ మండలాల్లో సంచరించిన పెద్దపులి పాదముద్రలను అధికారులు శనివారం కనుగొన్నారు. మండలంలోని ప్రతాపగిరి అడవుల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు శనివారం గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలు పెద్ద పులి భయంతో బెంబేలెత్తిపోతున్నాయి.
Similar News
News January 3, 2026
సామాజిక రుగ్మతల తొలగింపునకు కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థులకు బోధనతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బి.ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల ఐడీఓసీలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్.. తొలి మహిళా ఉపాధ్యాయురాలి ఆశయాలను కొనసాగించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News January 3, 2026
ఈ ఏడాదిలో 835 అగ్ని ప్రమాదాలు.. REPORT

2025కు సంబంధించిన అగ్ని ప్రమాదాల నివేదిక వెలువడింది. ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాలు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 835 అగ్ని ప్రమాదాలు జరగగా రూ.32 కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. GHMC పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News January 3, 2026
మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే ఆద్యురాలు: కలెక్టర్

కుల, లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషి వెలకట్టలేనిదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్, జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు.


