News March 2, 2025
ప్రతాపగిరి అడవుల్లో పులి పాదముద్రలు

కాటారం, మహాదేవపూర్ మండలాల్లో సంచరించిన పెద్దపులి పాదముద్రలను అధికారులు శనివారం కనుగొన్నారు. మండలంలోని ప్రతాపగిరి అడవుల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు శనివారం గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలు పెద్ద పులి భయంతో బెంబేలెత్తిపోతున్నాయి.
Similar News
News March 22, 2025
అనకాపల్లి: ఉగాది నుంచి పల్లె పండుగ పనులు ప్రారంభం

అనకాపల్లి జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులను ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ పనులపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆమె జిల్లా అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించారు. ఉగాది నుంచి వారం రోజులు పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News March 22, 2025
ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.
News March 22, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక వేధింపులు.. ఐదేళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేశాడన్న కేసులో నేరం రుజువు కావడంతో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానాను జిల్లా పొక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ విధించారు. వింజమూరు మండలానికి చెందిన బాలిక 2013 మే 6న కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. కృష్ణ అనే వ్యక్తి లైగింక దాడికి పాల్పడగా..వ్యతిరేకించడంతో బావిలోకి తోసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా శిక్ష పడింది.