News December 16, 2024

ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూనే ఉంటాం: సిరికొండ

image

ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. కుల సంఘ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించి వారిని గౌరవించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. శాసనమండలికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Similar News

News November 12, 2025

వరంగల్: ఉపాధ్యాయుల హాజరుపై FRS నిఘా..!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరుపై నిఘా పెట్టనుంది. హాజరు ఇన్, ఔట్ టైమ్‌లను యాప్‌లో నమోదు చేయకపోతే చర్యలు తప్పవు. సెలవు, ట్రైనింగ్, కార్యాలయ పనులకైనా యాప్ ద్వారా అనుమతి తప్పనిసరి. వరంగల్ జిల్లాలో 325 ప్రాథమిక, 121 ఉన్నత పాఠశాలల్లో ఈ యాప్ అమలు మొదలైంది.

News November 10, 2025

సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.

News November 10, 2025

పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

image

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణతో పాటు పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.