News August 30, 2024

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్న సర్కార్‌: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.

Similar News

News November 4, 2025

మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

image

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్‌లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.

News November 4, 2025

మెదక్ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏవైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. అవినీతి అనేది పెద్ద నేరమని, ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News November 3, 2025

మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

image

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.