News October 4, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్
ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.
Similar News
News December 22, 2024
NZB: బేస్బాల్ ఛాంపియన్గా జిల్లా మహిళా జట్టు
నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు బేస్బాల్ ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకుంది. సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బేస్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో నిజామాబాద్ జిల్లా జట్టు తలపడింది. ఇందులో 3-6 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.
News December 21, 2024
నిజామాబాద్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రిలో వివిధ విభాగాల అధికారులతో మాట్లాడారు.
News December 21, 2024
NZB: ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు
NZBలోని కాకతీయ విద్యాసంస్థలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని మృతి చెందిన ఘటన మరవకముందే మరో వివాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ బ్రాంచ్లో 8th క్లాస్ విద్యార్థి టాయిలెట్కు వెళ్లి హడావిడిలో ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. దీంతో అతడిని తరగతి గదిలో టీచర్ స్టేజిపైకి ఎక్కించి అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.