News December 9, 2024
ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు వరంగల్ పర్యటన సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 6 గ్యారెంటీల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.