News August 16, 2024
ప్రతిపక్ష నేతగా బొత్సకు అవకాశం..?

విశాఖ స్థానిక సంస్థల MLCగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదనంగా మరో పదవి వస్తుందని YCPలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ పదవిని బొత్సకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ లీడర్ బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలరని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే జగన్‌కు లేని ప్రతిపక్ష హోదా ఆయనకు వస్తుంది.
Similar News
News February 23, 2026
మధురవాడ: డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక- మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.
News February 23, 2026
విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 23, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.


