News August 16, 2024

ప్రతిపక్ష నేతగా బొత్సకు అవకాశం..?

image

విశాఖ స్థానిక సంస్థల MLCగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదనంగా మరో పదవి వస్తుందని YCPలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ పదవిని బొత్సకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ లీడర్ బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలరని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే జగన్‌కు లేని ప్రతిపక్ష హోదా ఆయనకు వస్తుంది.

Similar News

News September 17, 2024

ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక

image

ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.

News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

News September 16, 2024

జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?

image

గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.