News March 6, 2025
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో ఆయన ఛాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News September 17, 2025
HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్ని శాలువా పూలమాలలతో సత్కరించారు.
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.