News March 6, 2025

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News December 14, 2025

హైదరాబాద్‌లో మెస్సీ.. PHOTO GALLERY

image

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.

News December 14, 2025

రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సెలవు: సిద్దిపేట కలెక్టర్

image

రెండో విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సెలవు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట్-భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10 మండలాల్లోని గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు.

News December 14, 2025

పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్‌పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.