News June 23, 2024
ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి: జిల్లా కలెక్టర్
ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చే వారిపై ఉక్కు పాదం మోపుతానని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రుల ప్రాతినిథ్యం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
Similar News
News November 6, 2024
విష జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి
జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన బుధవారం రఘునాథపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పరికలబోడుతండాకు చెందిన సురేశ్ పెద్ద కుమార్తె కుషి(4)కి కొన్ని రోజులు నుంచి జ్వరం వస్తుండడంతో RMP వద్దనే చికిత్స చేయించారు. చిన్నారి ఆరోగ్యం విషమించడంతో చిన్నారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో చికిత్స పొందుతూ మరణించింది. వారం రోజుల కిందటే చిన్నారి బర్త్ డే జరిపారు.
News November 6, 2024
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
News November 6, 2024
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్
ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మద్దతు ధరకే నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కె.సురేంద్ర మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.