News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News October 14, 2025
హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం

AUSతో సిరీస్కు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై వచ్చిన <<17920712>>విమర్శలపై<<>> కోచ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ‘యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం 23ఏళ్ల పిల్లాడి గురించి ఇలా ప్రచారం చేయకండి. అతడి తండ్రి మాజీ ఛైర్మనో, మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. ఇప్పటివరకు సొంతంగా కష్టపడి ఆడిన అతడిని టార్గెట్ చేయడం సరికాదు. భవిష్యత్తులో మీ పిల్లల్ని కూడా ఎవరో ఒకరు టార్గెట్ చేయొచ్చని గుర్తుంచుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News October 14, 2025
జగిత్యాల: ఉ.9 దాటినా కానరాని సూరీడు..!

జగిత్యాల జిల్లాలో ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు అయినా సూర్యుడు కనిపించలేదు. అయితే తెల్లవారుజామున చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లులు కూడా కురిశాయి. ఈరోజు కూడా అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు పడుతున్నాయి.
News October 14, 2025
HYD: చనిపోయిన మహిళ వివరాలు గుర్తింపు

HYD మీర్పేట్ చందన (మంత్రాల) చెరువులో <<18001273>>మహిళ మృతదేహాన్ని<<>> బడంగ్పేట్ మమతానగర్ కాలనీకి చెందిన యాదమ్మ అలియాస్ కమల (50)గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైడ్రా బృందం సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు మీర్పేట్ పోలీసులు తెలిపారు.