News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News April 20, 2025
అల్లూరి: కూలీ కుమారుడికి జిల్లా ఫస్ట్ ర్యాంక్

చింతూరు మండలం గోరంగుంపు గ్రామానికి చెందిన ఎం.ప్రశాంత్ కుమార్ ఏకలవ్య 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్షలో 100కి 82మార్కులతో అల్లూరి జిల్లాలో ఫస్ట్, స్టేట్‌లో 6వ ర్యాంక్‌లో నిలిచాడని డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆదివారం తెలిపారు. తండ్రి నాగేశ్వరరావు, తల్లి మంజుల ఉపాధి కూలి పని చేసి ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. అల్లిగూడెం ఎంపీపీ పాఠశాల టీచర్స్, పేరెంట్స్ ప్రోత్సాహంతో ర్యాంక్ వచ్చిందని ప్రశాంత్ అన్నాడు.
News April 20, 2025
మెగా DSC.. వారికి ఫీజు నుంచి మినహాయింపు

AP: ప్రభుత్వం రిలీజ్ చేసిన <<16157650>>మెగా డీఎస్సీకి<<>> దరఖాస్తుల సమయంలో ఫీజు కట్టే విషయంలో కొందరు అభ్యర్థులకు గందరగోళం నెలకొంది. గత ఏడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
News April 20, 2025
కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.