News August 29, 2024

ప్రతి అర్జీ పరిష్కారం అవ్వాలి: మంత్రి అచ్చన్న

image

సచివాలయంలో ప్రజల నుంచి గురువారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అరాచక పాలనతో నష్టపోయిన పలువురు బాధితులు తమ బాధలు తెలియజేశారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి అర్జీ తప్పకుండా పరిష్కారం అవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కరంలో అలసత్వం వహించరాదన్నారు.

Similar News

News November 28, 2025

సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ సూచించారు.

News November 28, 2025

శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.