News April 4, 2025

ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సూర్యఘర్ పథకం కింద ఎంపిక చేసిన 5 మోడల్ గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో మోడల్ గ్రామాల అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్య ఘర్ పథకం అమల తీరుపై ఆరా తీశారు. సోలార్ ప్లాంట్ కు ముందుకు వచ్చే లబ్ధిదారులకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 6, 2025

ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News November 6, 2025

బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

image

సైబర్‌ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 6, 2025

సిరిసిల్ల: ‘రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు’

image

సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.