News August 15, 2024
ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా: ప.గో కలెక్టర్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 18, 2024
మంత్రి మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై మాట్లాడారు. అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు, ఈ మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు.
News September 18, 2024
సీఎం చంద్రబాబుతో సమావేశం.. హాజరైన మంత్రి నిమ్మల
చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం దశల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.
News September 18, 2024
ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర
ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.