News January 5, 2025
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు: గవర్నర్
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.
Similar News
News January 20, 2025
సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్
నాంపల్లి ఎగ్జిబిషన్ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు.
News January 20, 2025
కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!
HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.
News January 20, 2025
HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు
HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.