News January 5, 2025

ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు: గవర్నర్

image

ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.

Similar News

News November 30, 2025

హైకోర్టు: 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణ రాష్ట్ర జుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్ధతిలో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సివిల్ జడ్జిల పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను హై-కోర్టు వెబ్‌సైట్ http://tshc.gov.comని సంప్రదించవచ్చు.
SHARE IT

News November 30, 2025

HYD: ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు!

image

ఓపెన్ ప్లాట్లు, FLATS కొనే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. HMDA అనుమతులు ఉన్నా సరే.. అవి ‘బిల్డ్ నౌ’ ఆన్లైన్ సైట్‌లో చూపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి విషయానికి కార్యాలయంలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘బిల్డ్ నౌ’ సైట్‌లో వివరాలు అప్డేట్ కాకపోవడంతో, అందుకే కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News November 30, 2025

RRR నిర్మాణంలో కీలక పరిణామం

image

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 లేన్ రోడ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 161 కిలోమీటర్ల పనులకు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో నాలుగు లైన్లను నిర్మించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 లైన్స్ నిర్మించాలని కోరింది.