News May 10, 2024
ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

NLG:పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకొనుటకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.పోలింగ్ ముందు 48 గంటలు ఈనెల11 సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని వెల్లడించారు.సైలెన్స్ పీరియడ్ లో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.జిల్లాలో 144 సెక్షన్ అమలు లో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.
News October 16, 2025
నల్గొండ: భారీగా తగ్గిన దరఖాస్తులు

గతేడాదితో పోల్చుకుంటే మద్యం టెండర్లకు దరఖాస్తులు భారీగా తగ్గే అవకాశముంది. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం 496 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఈ సంఖ్య 7,057గా ఉంది. దరఖాస్తు చేయడానికి రెండు రోజులే అవకాశం ఉంది. డిపాజిట్ ధర పెంచడం కూడా దరఖాస్తులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
News October 15, 2025
పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.