News May 12, 2024
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగంచుకోవాలి: కలెక్టర్ క్రాంతి

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Similar News
News February 26, 2026
మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
News February 25, 2026
మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.


