News February 18, 2025
ప్రతి ఒక్కరూ ప్రజలకు న్యాయం చేయాలి: ఎస్పీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.
Similar News
News November 25, 2025
పులివెందులలో YS జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. జన సందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ బాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ పులివెందులకు రావడంతో క్యాంప్ కార్యాలయం వద్ద జన సందడి నెలకొంది. ఆయనను జిల్లా నేతలు కలిశారు.
News November 25, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
News November 25, 2025
ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


