News October 8, 2024
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్

ఖరీఫ్ 2024-25 సీజన్లో ఖమ్మం జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.
Similar News
News November 18, 2025
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

పేరెంట్-టీచర్స్ మీటింగ్ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.