News April 5, 2025
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 5, 2025
గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ పనులు వేగవంతం

గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు.
News April 5, 2025
మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్‌కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News April 5, 2025
గుంటూరులో సిటీ బస్సుకు నిప్పంటించిన దుండగులు

బృందావన్ గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఓ ఘటన కలకలం రేపింది. ఆటలాడుకుంటూ వేంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చిన ఇద్దరు మైనర్లు పార్కింగ్‌లో ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి ఇంజిన్ ఆయిల్ పోసి నిప్పంటించడంతో బస్సు కాలిపోయింది. మంటలు పక్కనే ఉన్న మరో బస్సును కూడా తాకాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పట్టాభిపురం పోలీసులు, నిప్పంటించిన మైనర్లను గుర్తించారు.