News February 18, 2025
ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: కలెక్టర్

స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్లాన్‌లో భాగంగా నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నియోజకవర్గ, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.
Similar News
News March 20, 2025
ఆర్సీబీ వదిలేశాక భావోద్వేగానికి లోనయ్యాను: సిరాజ్

ఆర్సీబీ నుంచి వేరయ్యాక తాను భావోద్వేగానికి లోనయ్యానని పేసర్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్ ఈరోజు ఇలా ఉండటం వెనుక విరాట్ కీలక పాత్ర పోషించారు. 2018-19 మధ్యకాలంలో నేను కష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మద్దతునిచ్చారు. ఆ తర్వాతే నా ప్రదర్శన మెరుగై నా కెరీర్ గ్రాఫ్ మారింది. వచ్చే నెల 2న RCBతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేలంలో ఆయన్ను గుజరాత్ దక్కించుకుంది.
News March 20, 2025
భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.
News March 20, 2025
జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.