News March 17, 2025

ప్రతి పంటకు నీరు ఇవ్వండి: కలెక్టర్

image

జిల్లాలో రబీలో సాగు అవుతున్న ప్రతి పంటకు సాగునీరు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ అధికారులు సాగునీటి అవసరాలను తెలియజేయాలన్నారు. పంచాయతీలలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. పి ఫోర్ సర్వే, వర్క్ ఫ్రం హోం, ఆధార్ క్యాంపులు, పన్ను సేకరణ, శనగ పంట కొనుగోళ్లపై కలెక్టర్ అరుణ్ బాబు జె.సి సూరజ్ గనూరే‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.

Similar News

News October 19, 2025

బాపట్లలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటించారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు రావద్దని సూచించారు.

News October 19, 2025

దీపావళి సందర్భంగా రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

దీపావళి పండుగ సెలవు దినం సందర్భంగా 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో కోరారు.

News October 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 40 సమాధానాలు

image

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ‘24 వేల’ శ్లోకాలు ఉన్నాయి.
2. ‘యముడి’ అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు.
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని అంటారు.
4. హనుమాన్ చాలీసాను రచించిన భక్తుడు ‘తులసీదాస్’.
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ‘కంచర్ల గోపన్న’.
<<-se>>#Ithihasaluquiz<<>>