News March 17, 2025
ప్రతి పంటకు నీరు ఇవ్వండి: కలెక్టర్

జిల్లాలో రబీలో సాగు అవుతున్న ప్రతి పంటకు సాగునీరు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ అధికారులు సాగునీటి అవసరాలను తెలియజేయాలన్నారు. పంచాయతీలలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. పి ఫోర్ సర్వే, వర్క్ ఫ్రం హోం, ఆధార్ క్యాంపులు, పన్ను సేకరణ, శనగ పంట కొనుగోళ్లపై కలెక్టర్ అరుణ్ బాబు జె.సి సూరజ్ గనూరేతో కలిసి సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 21, 2025
ప్రపంచంలో అతిపెద్ద పెట్రోల్ బంక్ ఇదే!

మన దగ్గర ఉండే పెట్రోల్ బంకుల్లో మహా అంటే 10 వరకు ఫిల్లింగ్ స్పాట్స్ ఉంటాయి. కానీ, ఒకేసారి 120 కార్లకు పెట్రోల్ ఫిల్ చేయగలిగే సామర్థ్యంతో బంక్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు సమీపంలో ‘Buc-ee’s’ అనే బంక్ ఉంది. ఇది 75,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉండగా ఇందులో ఫుడ్ & షాపింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
News April 21, 2025
కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి ఆరోపించారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు కావాలని అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సన్నాహక సదస్సుకు పాల్గొని మాట్లాడారు.
News April 21, 2025
పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్

AP: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి యాడ్స్ ఉండవు.