News April 15, 2025
ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి: ఎస్పీ

ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి, సమానత్వం, న్యాయం, విద్యకు హక్కు కోసం ఎంతో కృషి చేశారన్నారు.
Similar News
News November 27, 2025
భారీ సైబర్ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులు

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని భయపెట్టి రూ.1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.1,05,300 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సీబీఐ అధికారులుగా నటిస్తూ వాట్సాప్లో బెదిరించినట్లు మీడియాకు తెలిపారు. ఇంతటి భారీ మోసాన్ని ఛేదించిన పులివెందుల పోలీసులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలి: ADB SP

బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి సూచించారు. గురువారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలన్నారు. పట్టణంలో బీట్ సిస్టం సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.
News November 27, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. పోలీసులు READY

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కమిషనరేట్కు చెందిన అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రామాల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.


