News March 25, 2025

ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి: కలెక్టర్

image

ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళ, శిశు, దివ్యాంగుల వయేవృద్దుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక మౌడల్ అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు ఉన్నారు.

Similar News

News November 7, 2025

HYD: వీళ్లేం సెలబ్రెటీలు: సీపీ సజ్జనార్

image

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆద‌ర్శ‌నీయ‌మైన ఆట‌గాళ్లు ఎలా అవుతారని రైనా, ధవన్‌ను ఉద్దేశించి Xలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్య‌స‌న‌ప‌రులై వేలాది మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డటానికి వీరు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. ‘స‌మాజం, యువ‌త మేలు కోసం నాలుగు మంచి మాట‌లు చెప్పండి. అంతేకానీ అభిమానులను త‌ప్పుదోవ‌ప‌ట్టించి వారి ప్రాణాల‌ను తీయకండి’ అని రాసుకొచ్చారు.

News November 7, 2025

వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

image

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్‌ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.