News April 3, 2025
ప్రతి మండల కేంద్రం వాలీబాల్ కోర్టు: కలెక్టర్

ప్రతి మండల కేంద్రంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాస్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి జాహ్నవి పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
భూభారతి ద్వారా రైతులకు మేలు: భద్రాద్రి కలెక్టర్

భూభారతిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి నూతన చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2025
సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఖైదీ మృతి

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం మన మెదక్. జిల్లాలో వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, 100 ఏళ్ల సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చరిత్ర పరిశోధకుడు సంతోశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు World Heritage Day