News April 4, 2025
ప్రతి మహిళా లక్షాధికారి కావాలి: పార్వతీపురం కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక బృందాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఏపీడీలు, ఏపీఎంలను ఆదేశించారు. జిల్లాలో దాదాపు 2 లక్షల 30 వేల మంది మహిళా సభ్యులు ఉండగా, వారిలో సగానికి పైగా లక్ష లోపు వార్షికాదాయం ఉందన్నారు. అటువంటి వారిని గుర్తించి, వారితో అనుకూలంగా ఉండే వ్యాపారాలను చేపట్టి ప్రతి మహిళను లక్షాధికారునిగా తీర్చిదిద్దాలని అన్నారు.
Similar News
News December 3, 2025
మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్మెంట్తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.
News December 3, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పల్లికాయ, మొక్కజొన్న ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పచ్చి పల్లికాయ రూ.5,400 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మొక్కజొన్నకు రూ.1,945 ధర వచ్చిందన్నారు. కాగా, గత రెండు రోజులతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935 ధర రాగా, మంగళవారం రూ.1,905 ధర వచ్చింది.
News December 3, 2025
శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.


