News March 20, 2024

ప్రతి మహిళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

image

నల్గొండ జిల్లా సమాఖ్య భవనంలో పార్లమెంటు ఎన్నికల స్వీప్ కార్యక్రమాలలో భాగంగా క్రమబద్ధమైన ఓటరు విద్య పై మహిళా సంఘాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, అడిషనల్ DRDO శారద పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 25, 2025

NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

image

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

News November 25, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్‌లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి