News January 18, 2025
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం: కలెక్టర్

నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 16, 2025
చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News February 16, 2025
విద్యార్ధి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2025
అనంత: సేవాగడ్‌లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్‌లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్‌గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.