News August 11, 2024
ప్రతి రోజు వస్తుంది.. కానీ కోడూరు స్టాపింగ్ తొలగించారు

పాండిచ్చేరి- కాచిగూడ రైలుకు రైల్వే కోడూరులో స్టాపింగ్ తొలగించడం అన్యాయమని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండిచ్చేరి – కాచిగూడ రైలును రెండుగా మార్చి ఒక రోజు పాండిచ్చేరి వరకు మరొక రోజు చెంగల్‌పట్టు వరకు నడపడం వల్ల రాజంపేట, కడప నుంచి వెళ్లే ప్రయాణీకులకు మాత్రం ఈ రెండు రైళ్లు కలిపి వారం అంతా అందుబాటులో ఉంటాయి. వీరు ఆనందపడుతుండగా.. స్టాపింగ్ కావాలని కోడూరు ప్రయాణీకులు కోరుతున్నారు.
Similar News
News February 26, 2026
కడప: ఓ ప్రభుత్వ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

జౌళి శాఖ అధికారులు <<19165873>>తన సంతకాన్ని, పేరును<<>> వాడుకొని అక్రమాలు చేశారని ఇరిగేషన్ అధికారి AEE గౌతమ్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. AEE ఫిర్యాదు చేసి 3 నెలలు గడుస్తున్నా తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. PGRSలో ఓ ప్రభుత్వ అధికారి చేసిన ఫిర్యాదుకే చర్యలు లేనపుడు, సామాన్య ప్రజల ఫిర్యాదులు ఎలా పరిష్కారం అవుతాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
News February 26, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,730
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,472
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.
News February 26, 2026
పులివెందుల సీఐ ఇంట్లో భారీగా నగదు

ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


