News April 8, 2025
ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
Similar News
News October 19, 2025
HYD: సౌత్ జోన్.. తెలుగు వర్శిటీ క్రికెట్ జట్ల ఎంపిక

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో సౌత్ జోన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. ఈనెల 22న సౌత్ జోన్ క్రికెట్, రన్నింగ్ ఎంపికలు ఉంటాయని, బాచుపల్లి, నాంపల్లి క్యాంపస్ విద్యార్థులు పాల్గొనాలని, ఈ ఎంపికలు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతాయన్నారు. వర్శిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 19, 2025
జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కామారెడ్డి: స్టార్ క్యాంపెనియర్గా షబ్బీర్ అలీ

హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరగనున్న ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెనీయర్గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.