News April 8, 2025

ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఉండాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి వసతి గృహంలో నెల రోజుల్లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల నడవడికలను గమనించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వసతి గృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాలని వివరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు.

Similar News

News April 23, 2025

నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

image

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 23, 2025

నిర్మల్: ‘LRS క్రమబద్ధీకరణ రుసుంలో 25% రాయితీ’

image

ఆమోదం పొందిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ లేఔట్ల క్రమబద్ధకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆమోదం పొందిన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో రుసుంలో 25% రాయితీ కల్పించిందన్నారు.

News April 23, 2025

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్‌గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.

error: Content is protected !!