News November 27, 2024
ప్రతి వారం తనిఖీలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్

జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీతో ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల, కళాశాల, హాస్టల్, రెసిడెన్షియల్, ఆసుపత్రిని సందర్శించాలన్నారు. ప్రతి వారం తప్పకుండా తనిఖీ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 15, 2025
దర్యాప్తు, పరిశోధన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలి: ADB ఎస్పీ

హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణం, నీటిలో మునిగి చనిపోయిన, ఇతర నేరాల దర్యాప్తుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో 21 మంది పాల్గొన్నారు. కోర్టులో నేరస్థులకు శిక్షలు పడినప్పుడు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేర స్థలాన్ని ఏర్పాటు చేసి శిక్షణను అందించారు. ఎఫ్ఐఆర్, కస్టడీ, అరెస్టు, రిమాండ్ అంశాలపై శిక్షణ అందించారు.
News November 15, 2025
ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఆధార్–మీసేవ ప్రత్యేక సమీకృత శిబిరాల్లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు మంజూరైన ఆధార్ కార్డులు, ఆదాయ, నివాసతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని అన్నారు.


