News November 27, 2024
ప్రతి వారం తనిఖీలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్
జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీతో ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల, కళాశాల, హాస్టల్, రెసిడెన్షియల్, ఆసుపత్రిని సందర్శించాలన్నారు. ప్రతి వారం తప్పకుండా తనిఖీ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
MNCL: పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్
పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటేలిఖితపూర్వకంగా తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 2, 2,730 కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
News December 10, 2024
రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం
గ్రామ పంచాయితి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించామన్నారు.
News December 10, 2024
నిర్మల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ చర్యలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.