News January 22, 2025
ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరి: భూపాలపల్లి డీఈవో

దేశ పౌరులకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ప్రతి విద్యార్థికి అపార్(ఆటోమోటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ కూడా తప్పనిసరిగా ఉండాలని భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన కాటారం మండలంలోని తెలంగాణ గిరిజన, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన అపార్ వర్క్ షాప్‌ను బుధవారం పరిశీలించారు. పలువురు జిల్లా, మండలాధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.
News November 20, 2025
దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి CM రేవంత్ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
News November 20, 2025
చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.


